నల్గొండ: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణపై కేసు నమోదైంది. మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రణయ్ హత్యోదంతం నేపథ్యంగా ‘మర్డర్’ సినిమా చిత్రీకరణపై అభ్యంతరాలతో మిర్యాలగూడ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
సినిమా కోసం ప్రణయ్, అమృత, మారుతీరావు ఫొటోలు వాడారంటూ ప్రణయ్ తండ్రి బాలస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది. ఈ మేరకు దర్శకుడు, నిర్మాతపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులను ఆదేశించింది. సినిమా చిత్రీకరణ నిలిపివేయాలన్న పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది.
‘ఓ తండ్రి కుమార్తెను అతిగా ప్రేమిస్తే ఎంత ప్రమాదమో తెలిపే అమృత, మారుతీరావు కథతో తెరకెక్కించబోతున్న ఈ చిత్రం హృదయాల్ని కదిలిస్తుంది. శాడ్ ఫాదర్స్ ఫిల్మ్ పోస్టర్‌ను ఫాదర్స్ డే రోజున విడుదల చేస్తున్నా’ అని వర్మ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇదే విషయమై అమృత స్పందించారంటూ ఓ పోస్ట్ సోషల్‌మీడియాలో హల్చల్ చేయడంతో ‘‘కొందరిని చెడుగా చూపించడానికి నేను ఈ సినిమాను తీస్తున్నాను అనుకోవడం సరికాదు. ఎందుకంటే.. ఏ వ్యక్తి చెడు కాదని నేను గట్టిగా నమ్ముతా. కేవలం ప్రతికూల పరిస్థితులు వ్యక్తిని చెడ్డవాడిని చేస్తాయి. అలా ప్రవర్తించేందుకు కారణమౌతాయి. దీన్నే నేను ‘మర్డర్’లో చూపించాలి అనుకుంటున్నా. ఆ ప్రకటన రాసిన వారికి నేను చివరిగా ఒకటి చెబుతున్నా.. మనుషులపై, వారి ఫీలింగ్స్‌పై నాకు గౌరవం ఉంది. వారు పడ్డ బాధను, నేర్చుకున్న పాఠాన్ని గౌరవిస్తూ మర్డర్ తీయబోతున్నా’’ అని వర్మ పేర్కొన్నారు.
మరిన్ని
కొత్త సినిమాలు
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
-
సందడి చేస్తోన్న ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
-
‘మహా సముద్రం’లో శర్వానంద్ ఇలా..!
-
తీసేవాడుంటే ప్రతివాడి బతుకు బయోపిక్కే..!
గుసగుసలు
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
రివ్యూ
ఇంటర్వ్యూ
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
కొత్త పాట గురూ
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని