నితిన్‌కు ‘రంగ్‌దే’ టీమ్‌ పెళ్లి సర్‌ప్రైజ్‌ చూశారా? - A Cute Marriage Gift to our Hero Nithiin from team RangDe
close
Updated : 27/07/2020 15:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నితిన్‌కు ‘రంగ్‌దే’ టీమ్‌ పెళ్లి సర్‌ప్రైజ్‌ చూశారా?

హైదరాబాద్‌: నితిన్‌ వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘రంగ్‌ దే’ బృందం పెళ్లి కానుకగా టీజర్‌ని విడుదల చేసింది. ‘పెళ్లి  కొడుకెక్కడ...’ అనే సంభాషణతో మొదలయ్యే టీజర్‌లో పలు సంభాషణలు అలరిస్తాయి. ‘నాన్నా... నవ్వుతోంది, నేను కట్టలేను నాన్నా’ అంటూ పెళ్లికి సంబంధించిన సంభాషణ నవ్విస్తుంది. ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్‌ సరసన కీర్తిసురేష్‌ నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకుడు.

‘‘ఈ రోజుకు అదనపు ప్రత్యేకతను తీసుకొచ్చిన ‘రంగ్‌దే’ చిత్ర బృందానికి ధన్యవాదాలు. నా చిత్ర నుంచి అభిమానులు, స్నేహితుల కోసం ఈ ఫన్‌ టీజర్‌. ఆస్వాదించండి’’ -ట్విటర్‌లో నితిన్‌

‘రంగ్‌దే’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మరోవైపు నితిన్‌ ‘అంధాధూన్‌’ రీమేక్‌తో పాటు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లాయి. వీటితో పాటు దర్శకుడు కృష్ణ చైతన్యతో ‘పవర్‌ పేట’ అనే ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది నితిన్‌ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రం. దీన్ని రెండు భాగాలుగా తీయబోతున్నట్లు సమాచారం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని