నాని లైఫ్‌లో గుర్తుండిపోయే రోజుది..! - A proud moment and a great blessing for Natural star
close
Updated : 10/12/2020 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాని లైఫ్‌లో గుర్తుండిపోయే రోజుది..!

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటించనున్న సరికొత్త చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఈ చిత్రానికి రాహుల్‌ దర్శకత్వం వహించనున్నారు. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నానికి ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ అందమైన విషయం చోటుచేసుకుంది. అదేమిటంటే.. ముహూర్తపు సన్నివేశానికి నానిపై తన తండ్రి గంటా రాంబాబు క్లాప్‌ కొట్టారు. తన తండ్రి క్లాప్‌తో సినిమాని ఆరంభించడం నాని కెరీర్‌లోనే ఇదే తొలిసారి.

విభిన్న కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి నటించనున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమంలో హీరోయిన్స్‌, ఇతర చిత్రబృందంతోపాటు అనిల్‌ రావిపూడి, శివా నిర్వాణ, వెంకీ కుడుముల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రస్తుతం ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఆరంభోత్సవానికి సంబంధించిన ఫొటోలు ప్రతిఒక్కర్నీ ఆకర్షిస్తున్నాయి.

ఇదీ చదవండి

శ్యామ్‌ సింగరాయ్‌ ఆరంభం ఫొటోలు

ప్రకాశ్‌రాజ్‌ను చూసి భయపడ్డా: సాయిపల్లవిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని