కరోనాను జయించిన 105 ఏళ్ల వృద్ధురాలు!  - A woman of 105 yrs age recovered from covid-19
close
Published : 07/08/2020 20:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాను జయించిన 105 ఏళ్ల వృద్ధురాలు! 

కర్నూలు: కొవిడ్‌ నుంచి కోలుకోవాలంటే మందులు ఒక్కటే కాదు.. మనోధైర్యం కూడా ముఖ్యమే అని చెబుతోంది 105 ఏళ్ల ఓ వృద్ధురాలు. ఈ వయసులో కొవిడ్‌ను జయించి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి చేరుకుని అందరిరీ ఆదర్శంగా నిలుస్తోంది. కర్నూలు పాతనగరంలోని పెద్దపడకానా ప్రాంతంలో నివాసం ఉండే మోహనమ్మ ఇటీవల కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. జులై 19న వచ్చిన ఫలితాల్లో కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మోహనమ్మను కర్నూలు సర్వజన వైద్య శాలలో చేర్పించారు. శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఉండటంతో ఆమెకు వైద్యులు ఆక్సిజన్‌ కూడా అందించారు. ఈ క్రమంలో కేవలం 14 రోజుల్లోనే మోహనమ్మ కొవిడ్‌ నుంచి బయట పడటం అందరికీ ఆశ్చర్చానికి గురిచేసింది. 

పోషకాలు కలిగిన ఆహారం, యోగా, ధ్యానంతో మంచి ఫలితాలు ఉంటాయని మోహనమ్మ అన్నారు. మొదటి నుంచీ ఆహారం విషయంలో క్రమ శిక్షణతో వ్యవహరించడమే మోహనమ్మ కోలుకోవడానికి ప్రధాన కారణమని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. వైరస్‌ సోకిన వారు వెంటనే భయపడకుండా ధైర్యంగా ఎదిరిస్తే కరోనాను జయించవచ్చని ఈ సందర్భంగా వారు సూచించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని