ఐపీఎల్‌కు ‘మిస్టర్‌ 360’ అనుమానమే! - AB de Villiers doubtful for ipl
close
Published : 25/07/2020 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐపీఎల్‌కు ‘మిస్టర్‌ 360’ అనుమానమే!

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 జరుగుతుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ ప్రకటించగానే అభిమానులంతా సంతోషించారు. వేదిక భారత్‌ కాకపోయినప్పటికీ టీవీల్లో చూసి ఆనందించొచ్చని భావించారు. అయితే ఆయా బోర్డులు నిరభ్యంతర పత్రాలు ఇచ్చినప్పటికీ కొందరు స్టార్‌ ఆటగాళ్లు రావడం కష్టమేనని సమాచారం. లాజిస్టిక్స్‌, రవాణా పరంగా ఇబ్బందులు ఎదురవ్వడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికలు జరిగే ఐపీఎల్‌-2020లో పాల్గొనేందుకు తమ ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రాలు ఇస్తామని న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డులు ప్రకటించాయి. కివీస్‌ ఆటగాళ్లు వచ్చేందుకు ఇబ్బంది లేనప్పటికీ సఫారీల రాక సందేహమేనని సమాచారం. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కీలకమైన ఏబీ డివిలియర్స్‌, ముంబయి ఇండియన్స్‌కు ప్రధాన కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ రావడం కష్టమేనని అనిపిస్తోంది. మరో ఎనిమిది మందిదీ ఇదే పరిస్థితి.

ఐపీఎల్‌ ఆడేందుకు తాము అనుమతి ఇస్తామని అయితే లాజిస్టిక్స్‌, ప్రయాణ సదుపాయాల బాధ్యత మాత్రం ఆటగాళ్లదేనని బోర్డు తెలిపింది. ఇలాంటి ఇబ్బందుల వల్లే ఇమ్రాన్‌ తాహిర్‌, తబ్రైజ్‌ షంసి, రసి వాన్‌ డర్‌ డుసెన్‌, రిలీ రొస్సొ, అన్రిచ్‌ నోర్జె, కొలిన్‌ ఇంగ్రామ్‌ ఆగస్టులో ఆరంభమయ్యే కరీబియన్‌ లీగ్‌కు వెళ్లలేకపోతున్నారు. వైరస్‌ ఎక్కువగా ఉండటంతో దక్షిణా ప్రభుత్వం సరిహద్దులను మూసేసింది. విమానాలకు అనుమతి ఇవ్వడం లేదు. మరి బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు వీరిని ప్రత్యేక విమానాల్లో అక్కడి నుంచి తీసుకొస్తాయేమో చూడాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని