సుశాంత్‌ కేసు: నివేదిక ఇచ్చిన ఎయిమ్స్‌ టీమ్‌ - AIIMS forensic team submits reports to CBI in Sushant case
close
Updated : 29/09/2020 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌ కేసు: నివేదిక ఇచ్చిన ఎయిమ్స్‌ టీమ్‌

దిల్లీ: నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ మరణంపై దిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి సమర్పించింది. సీబీఐ అభ్యర్థన మేరకు వైద్యుడు డా.సుధీర్‌ గుప్తా అధ్యక్షతన ఓ ఫోరెన్సిక్‌ వైద్య బృందం ఏర్పాటైంది. సుశాంత్‌ శరీర అంతర్భాగాల్లోనుంచి తీసిన నమూనాలకు సెప్టెంబర్‌ 7న సదరు ఫోరెన్సిక్‌ బృందం పరీక్షలు నిర్వహించింది. మరో ముగ్గురు సభ్యులతో కూడిన వైద్య బృందాన్ని కూడా నటుడి ఇంటికి సీబీఐ తీసుకెళ్లి ఫోరెన్సిక్‌ సహా తదుపరి దర్యాప్తు కోసం పరీక్షలు నిర్వహించింది. సోమవారం అప్పగించిన సదరు నివేదికను సీబీఐ ప్రస్తుతం పరిశీలిస్తోంది.

జూన్‌ 14వ తేదీన సుశాంత్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్రగ్స్‌ కోణంలోనూ ఈ కేసులో విచారణ జరుగుతోంది. నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు, పలువురు సుశాంత్‌ సిబ్బంది అతడికి డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు తేలడంతో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) వారందరిని అరెస్టు చేసింది. పలువరు డ్రగ్‌ డీలర్లు సహా ఇప్పటికి 18 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మాదకద్రవ్యాల కేసులోనే బాలీవుడ్‌ ప్రముఖ నటీమణులు దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌లను కూడా ఎన్‌సీబీ ఇటీవల విచారించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని