‘కాంచన’లో ఆ పాట హిందీలో ఇలా! - AKSHAY KUMAR AS LAXMII IN BAM BHOLLE
close
Published : 06/11/2020 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కాంచన’లో ఆ పాట హిందీలో ఇలా!

ఇంటర్నెట్‌డెస్క్‌: అక్షయ్‌ కుమార్‌ కీలక పాత్రలో రాఘవ లారెన్స్‌ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మి’. కియారా అడ్వాణీ కథానాయిక. సూపర్‌హిట్‌ చిత్రం ‘కాంచన’కు రీమేక్‌గా ఇది రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 9న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ చూసి, అభిమానులు, బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ నటనకు ఫిదా అవుతున్నారు.

తాజాగా ‘లక్ష్మి’లో ‘భం భోలే’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో హిజ్రాగా అక్షయ్‌ ఎర్రచీర కట్టుకుని అర్ధనారీశ్వర విగ్రహం ఎదుట చిందులు వేస్తూ కనిపించారు. ఇందులో అక్షయ్‌ నటన చూసి అందరూ ఆశ్చరపోతున్నారు. తెలుగు/తమిళ భాషల్లో లారెన్స్‌ ఈ పాటకు డ్యాన్స్‌ చేశారు. ‘విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన’ అంటూ సాగే ఆ పాట థియేటర్‌లో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు అక్షయ్‌ ఈ పాట చిందేస్తూ అదరగొట్టారు. మరి అక్షయ్‌ నటన విశ్వరూపం మీరూ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని