అల్లు అర్జున్‌ చిత్రం సరికొత్త రికార్డు - ALL TIME RECORD OF HIGHEST TRP FOR A TELUGU FILM Ala vikuntapuramulo
close
Updated : 27/08/2020 14:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల్లు అర్జున్‌ చిత్రం సరికొత్త రికార్డు

ఇంటర్నెట్‌డెస్క్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే, నివేది పేతురాజు కథానాయికలు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ స్టైల్‌, నటన, కామెడీ టైమింగ్‌, త్రివిక్రమ్‌ శైలి దర్శకత్వం, పూజ అందాలు విశేషంగా అలరించాయి. ఇక తమన్‌ పాటలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

కాగా, ఇటీవల ఈ చిత్రం బుల్లితెరపై ప్రసారమైంది. అత్యధికంగా 29.4 టీఆర్‌పీతో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిందని చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు సంగీత దర్శకుడు తమన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘సినిమా విడుదలై ఆరు నెలలు దాటింది. ఓటీటీలోనూ విడుదలైంది. అయినా, అల వైకుంఠపురం క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 29.4 టీఆర్‌పీతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది’’ అని ట్వీట్‌ చేశారు.

హారిక, హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌లు ఈ సినిమా నిర్మించారు. ఇక తమన్‌ అందించిన పాటలు యువతను విశేషంగా అలరించాయి. ‘సామజవరగమన’, ‘రాములో రాములా..’, ‘బుట్టబొమ్మ’ పాటలకు చిన్నా పెద్దా అందరూ ఫిదా అయిపోయారు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని