ఏపీలో వాహన జరిమానాలు భారీగా పెంపు - AP Govt Imposes Heavy Fines For Traffic Violations
close
Published : 22/10/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో వాహన జరిమానాలు భారీగా పెంపు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి: మోటారు వాహనాల చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించేవారిపై విధించే జరిమానాలను ఏపీ ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. జరిమానాలను రెండు కేటగిరీలుగా నిర్ణయించారు. ద్విచక్ర వాహనంతో పాటు తేలికపాటి నాలుగు చక్రాల వాహనాలు ఒక కేటగిరీ.. భారీ వాహనాలను మరో కేటగిరీగా విభజించారు. 

జరిమానాలు ఇలా..

వాహనాల తనిఖీ సమయంలో సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తే రూ.750 జరిమానా విధించనున్నారు. అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే రూ.5వేలు, డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే రూ.10వేలు జరిమానా వేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5వేలు, వేగంగా వాహనం నడిపితే రూ.వెయ్యి, మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడపడంతోపాటు ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10వేలు విధించనున్నారు. 

రేసింగ్ చేస్తూ మొదటిసారి పట్టుబడితే రూ.5వేలు.. రెండోసారి రూ.10వేల జరిమానా వేయనున్నారు. రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోతే మొదటిసారి రూ.2వేలు, రెండోసారి రూ.5వేల జరిమానా విధిస్తారు. పర్మిట్‌లేని వాహనాలు నడిపితే రూ.10వేలు.. ఓవర్‌లోడ్‌తో వెళ్తే రూ.20వేలు.. ఆపై టన్నుకు రూ.2వేల చొప్పున అదనంగా వేయనున్నారు. బరువు తనిఖీ కోసం వాహనం ఆపకపోయితే రూ.40వేల భారీ జరిమానా విధించనున్నారు. అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10వేలు.. అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటి సారి రూ.వెయ్యి, రెండోసారి రూ.2వేల ఫైన్‌ వేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో మార్పులు చేర్పులు చేస్తే తయారీ సంస్థలు, డీలర్లు, అమ్మినవారికి రూ.లక్ష జరిమానా విధించనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని