ధోనీ ఆ మార్పును అద్భుతంగా తీసుకొచ్చాడు - Aakash Chopra disagrees Gambhirs comments on Ganguly and Dhonis leadership qualities
close
Published : 18/07/2020 00:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధోనీ ఆ మార్పును అద్భుతంగా తీసుకొచ్చాడు

గంభీర్‌ వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఆకాశ్‌ చోప్రా

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాలో గంగూలీ, ధోనీ ఎంత గొప్ప సారథులో అందరికీ తెలిసిందే. ఒకరు జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దితే మరొకరు ఆ జట్టును ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. దాంతో ఇద్దరిలో ఎవరు అత్యంత గొప్ప సారథి అని అడిగితే చెప్పడం ఎవరికైనా కష్టమే. అయితే, గంభీర్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గంగూలీ మ్యాచ్‌ విన్నర్లను తీసుకొచ్చినంతగా ధోనీ తీసుకురాలేకపోయాడని వ్యాఖ్యానించాడు. కోహ్లీ, రోహిత్‌, బుమ్రాలు తప్ప గొప్ప ఆటగాళ్లు రాలేరని గౌతీ అన్నాడు. ఇదే విషయాన్ని  ఆకాశ్‌చోప్రా ఖండించాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ ధోనీ టీమ్‌ఇండియాను అద్భుతంగా తీర్చిదిద్దాడని, ఆ తర్వాత 2017లో కోహ్లీకి అప్పగించాడని చెప్పాడు. అలాగే జట్టులో మార్పులు చోటుచేసుకుంటున్న వేళ మహీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడని వివరించాడు. 

ధోనీ దిగ్గజ ఆటగాళ్లతో పాటు యువ క్రికెటర్లను కూడా  చూసుకోవాల్సి వచ్చిందని, అలాంటి పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించాడని గుర్తుచేశాడు. సీనియర్లను నొప్పించకుండానే యువ క్రికెటర్లను ప్రోత్సహించడం కష్టతరమైన పని అని, దాన్ని ధోనీ సమర్థవంతంగా పూర్తి చేశాడన్నాడు. కోహ్లీ, రోహిత్‌ అతని సారథ్యంలోనే మెరుగయ్యారని చోప్రా చెప్పుకొచ్చాడు. బుమ్రా సైతం ధోనీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకునే ముందు జట్టులోకి వచ్చాడని గుర్తుచేసుకున్నాడు. కాబట్టి.. గంగూలీ, ధోనీల కెప్టెన్సీలను పోల్చి చూడటం సరికాదన్నాడు. చివరగా గంగూలీ సారథ్యంపై మాట్లాడిన చోప్రా మ్యాచ్‌ విన్నర్లను వెలికి తీసిన విషయంలో గంభీర్‌ వ్యాఖ్యలను సమర్థిస్తానని చెప్పాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతం ప్రపంచ క్రికెట్‌ను కుదిపేసిన సమయంలో దాదా జట్టు పగ్గాలు అందుకున్నాడని, ఆ తర్వాత సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ లాంటి ఆటగాళ్లకు అవకాశాలిచ్చి వారిని ప్రోత్సహించాడని స్పష్టంచేశాడు. గంగూలీ అలా భారత జట్టుపై చెరగని ముద్ర వేశాడని చోప్రా అన్నాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని