దాదా కన్నా గంభీర్‌ భరోసా ఇచ్చాడు‌..అందుకే - Aakash chopra says Gautam Gambhir gave confidence to KKR players in the ipl
close
Published : 15/08/2020 17:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దాదా కన్నా గంభీర్‌ భరోసా ఇచ్చాడు‌..అందుకే

కేకేఆర్‌లో ఎవర్ని అడిగినా అదే చెబుతారు: ఆకాశ్‌చోప్రా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌) ప్రస్థానం ప్రత్యేకం. ఇప్పటివరకు ఆ జట్టు నలుగురు సారథులను మార్చింది. అయితే, అందరిలో ఎక్కువకాలం సారథ్య బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌ గంభీర్‌.. ఆటగాళ్లకు భరోసానిచ్చాడని, అలాగే ఉత్తమ సారథిగా నిలిచాడని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు కేకేఆర్‌ జట్టు ప్రయాణంపై తన యూట్యూబ్‌ ఛానల్‌లో స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా కోల్‌కతా ప్రిన్స్‌ సౌరభ్‌ గంగూలీని తొలగించి దిల్లీ బ్యాట్స్‌మన్‌ గౌతమ్‌ గంభీర్‌ను ఆ జట్టు సారథిగా మార్చడం కీలక మలుపు అని వ్యాఖ్యానించాడు.

కేకేఆర్‌ను చోప్రా మూడు భాగాలుగా విభజించాడు. తొలుత గంగూలీ కెప్టెన్సీ, తర్వాత గంభీర్‌, ఆపై దినేశ్‌ కార్తిక్‌ జట్లుగా విడదీశాడు. ఆ జట్టు యజమాని షారుఖ్‌ఖాన్‌ తొలి సీజన్‌లోనే అత్యుత్తమ సిబ్బందిని నియమించినా ఆ జట్టు విఫలమైందని, తర్వాత 2009లో న్యూజిలాండ్‌ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కలమ్‌కు కెప్టెన్సీ అప్పగించడం, మళ్లీ 2010లో దాదాను నియమించడం లాంటి విశేషాలను గుర్తుచేసుకున్నాడు. చివరికి అప్పుడు కూడా ఆ జట్టు విఫలమవ్వడంతో షారుఖ్‌ కీలక నిర్ణయం తీసుకొని గంభీర్‌ను ఎంపిక చేశాడని చెప్పాడు. అతడి కెప్టెన్సీలో ఆడిన తొలి సీజన్‌లోనే కేకేఆర్‌ నాలుగో స్థానం చేరిందని, తర్వాత రెండుసార్లు టైటిల్‌ విజేతగా నిలిచిందని చోప్రా పేర్కొన్నాడు. అయితే, దాదా కన్నా దిల్లీ క్రికెటరే ఆ జట్టు ఆటగాళ్లకు భరోసా ఇచ్చాడని, ఈ విషయాన్ని అతడి సారథ్యంలో ఆడిన ఏ ఆటగాడిని అడిగినా చెబుతారని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ చెప్పాడు.

అలాగే గంభీర్‌ విజయవంతం కావడానికి మరో కారణం కూడా ఉందన్నాడు. అదే అతడి దూకుడుతనం. గౌతీ చెప్పిన మాట, చేసే పనిని ఆటగాళ్లు కూడా కచ్చితంగా పాటించాలని చెప్పేవాడని తెలిపాడు. అలా అతడు ముందుండి జట్టును నడిపించాడన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని