లాల్‌సింగ్‌ కోసం వచ్చే నెలలో? - Aamir Khan and Naga Chaitanya To Take Action Sequences for Laal Singh Chaddh
close
Published : 03/05/2021 19:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాల్‌సింగ్‌ కోసం వచ్చే నెలలో?

క్కినేని వారసుడు.. కథానాయకుడు నాగచైతన్య బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అమిర్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో ఆయన ఓ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్‌ గంప్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. కరీనా కపూర్‌ కథానాయిక. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. వచ్చే నెల నుంచి ఆఖరి షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లోనే నాగచైతన్య చిత్రీకరణలో పాల్గొననున్నారని సమాచారం. లద్దాఖ్‌, కార్గిల్‌ ప్రాంతాల్లో దాదాపు 45రోజుల పాటు ఈ చిత్రీకరణ కొనసాగనుంది. ఇందులో భాగంగా అమిర్‌, చైతూలపై కార్గిల్‌ వార్‌ నేపథ్యంలో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని