అఫ్రిదీకి బదులు యూసుఫ్‌ను తీసుకునేవాడ్ని.. - Aamir Sohail describes why they lost 1999 WC and shahid afridis role in that tournament
close
Published : 23/07/2020 23:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అఫ్రిదీకి బదులు యూసుఫ్‌ను తీసుకునేవాడ్ని..

1999 ప్రపంచకప్‌లో పాక్‌ ఓటమికి రెండు కారణాలు: ఆమిర్‌ సోహేల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: 1999 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఓటమికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఆ జట్టు మాజీ బ్యాట్స్‌మన్‌ ఆమిర్‌ సోహేల్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన అతడు 1975 నుంచి 2019 ప్రపంచకప్‌ వరకు అన్ని ఫైనల్‌ మ్యాచ్‌ల విశేషాలను గుర్తుచేసుకున్నాడు. ఆయా మెగా టోర్నీల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాయో వివరించాడు. ఈ నేపథ్యంలోనే 1999లో పాక్‌ రెండోసారి విశ్వవిజేతగా నిలిచే అవకాశాల్ని ఎలా కోల్పోయిందో స్పష్టంచేశాడు. అలాగే ఆ ప్రపంచకప్‌లో అఫ్రిదీని ఓపెనర్‌గా తీసుకోవడం జట్టు యాజమాన్యం తప్పుడు నిర్ణయమని పేర్కొన్నాడు. 

వసీం అక్రమ్‌ స్థానంలో తానుంటే అఫ్రిదీకి బదులు మహ్మద్‌ యూసుఫ్‌ను తీసుకునేవాడినని, కానీ జట్టు యాజమాన్యం అతడినే తీసుకుందని సోహేల్‌ చెప్పుకొచ్చాడు. మాజీ ఆల్‌రౌండర్‌ కేవలం ఫ్లాట్‌ పిచ్‌లపై చెలరేగుతాడని, సవాలు విసిరే పరిస్థితుల్లో ఆడలేడని చెప్పాడు. అలాగే, అఫ్రిదీ అటు బౌలింగ్‌ కానీ, ఇటు బ్యాటింగ్‌ కానీ చేయలేకపోయాడని తెలిపాడు. అనంతరం పాక్‌ ఓటమికి గల రెండు ప్రధాన కారణాలను వెల్లడించాడు. ఒకటి టీమ్‌ కాంబినేషన్‌ సరిగ్గాలేదని, మరొకటి టాస్‌ గెలిచాక పిచ్‌ సహకరించదని తెలిసీ బ్యాటింగ్‌ ఎంచుకోవడమని సోహేల్‌ అన్నాడు. ఆ టోర్నీలో పాక్‌ ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో బ్యాటింగ్‌ లైనప్‌తో ఆడిందని చెప్పాడు. ఇక ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఆ ఫైనల్లో  టాస్‌ గెలిచిన పాక్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొని కేవలం 132 పరుగులే చేసింది. అనంతరం కంగారూల జట్టు రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని