మరింత థ్రిల్లింగ్‌గా ఆ వెబ్‌ సిరీస్‌కు కొనసాగింపు! - Aashram 2 motion poster
close
Published : 22/10/2020 19:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరింత థ్రిల్లింగ్‌గా ఆ వెబ్‌ సిరీస్‌కు కొనసాగింపు!

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు బాబీ దేఓల్‌ కీలక పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఆశ్రమ్‌’. ఇటీవల విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌కు మంచి ఆదరణ దక్కింది. కాగా, త్వరలోనే దీనికి కొనసాగింపుగా ‘ఆశ్రమ్‌2’ కూడా రాబోతోంది. ప్రకాష్‌ ఝా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ నవంబరు 11 నుంచి ఎంఎక్స్‌ ప్లేయర్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.ఈ నేపథ్యంలో మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

అన్ని రంగాలను శాసించే బాబా నిరాలా ఆఫ్‌ కాశీపూర్‌ పాత్రలో బాబీ దేఓల్‌ నటించారు. తొలిసారి ఆయన ఈ వెబ్‌సిరీస్‌లో నటిస్తుండటం విశేషం. దేవుడి ప్రతినిధిగా నిరాలా బాబాను భక్తులు ఏవిధంగా కొలిచేవారు. ఆయనను ఏవిధంగా అనుసరించేవారు. ఆ ఆశ్రమంలో జరిగిన అత్యాచారం, హత్యల వెనుక ఉన్నది ఎవరు? చివరకు బాబా ఏమయ్యారు? ఆయనలోకి క్రూరత్వం ఎలా బయటపడింది? తదితర విషయాలు తెలియాలంటే ‘ఆశ్రమ్2‌’ చూడాల్సిందే.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని