
తాజా వార్తలు
షాకింగ్ గెటప్‌లో అభిషేక్ బచ్చన్!
దిల్లీ: అభిషేక్ బచ్చన్ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం ‘బాబ్ బిశ్వాస్’ కోల్‌కతాలో చిత్రీకరణ జరుగుతోంది. కాగా దీనిలో ‘స్మాల్ బీ’ అభిషేక్ గెటప్ అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. వెడల్పైన పెద్ద కళ్లజోడు, పాపిడి తీసిన హెయిర్ స్టైల్‌తో మధ్య వయసు వ్యక్తిలాగా ఆయన ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఇంతకీ దీనికి ప్రేరణ ఏదంటే...
ప్రముఖ దర్శకుడు సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన సూపర్‌హిట్ బాలీవుడ్ చిత్రం ‘కహానీ’. దీనిలో హీరోయిన్ విద్యా బాలన్‌కు ఎంత పేరు వచ్చిందో.. ‘బాబ్ బిశ్వాస్’ పాత్రకు కూడా అంతే పాపులారిటీ వచ్చింది. బయటకు బీమా ఏజెంటుగా కనిపించే.. కరడు గట్టిన కిరాయి హంతకుడి పాత్రను శాశ్వతా ఛటర్జీ అనే నటుడు పోషించారు. కాగా, ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ బాబ్ బిశ్వాస్ చిత్రంలో ఆ గెటప్‌లో కనిపించనున్నారు. ఈయన సరసన చిత్రాంగదా సింగ్ నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, తన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తుండటం విశేషం. దీనికి సుజోయ్ ఘోష్ కుమార్తె దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరిలో తొలి షెడ్యూలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొవిడ్ కారణంగా వాయిదాపడింది. ఇక జూనియర్ బచ్చన్ జులైలో కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన కోలుకున్న అనంతరం సినిమా చిత్రీకరణ తిరిగి పట్టాలకెక్కింది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
