25 ఏళ్ల తర్వాత వస్తున్న నటి ఎవరు? - Actress Appeared front Of Camera After 25 Years
close
Published : 12/11/2020 15:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

25 ఏళ్ల తర్వాత వస్తున్న నటి ఎవరు?

ఆకట్టుకుంటున్న వీడియో

హైదరాబాద్‌: మాటల్లోని చలాకీతనం, చూపుల్లోని అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన ఓ నటి దాదాపు పాతికేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈటీవీ వేదికగా ప్రతి సోమవారం రాత్రి ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ఆమె విచ్చేస్తున్నారు.

ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ స్పెషల్‌ ప్రోమో ప్రస్తుతం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ‘25 సంవత్సరాల తర్వాత మీ ముందుకు వస్తున్న ఆ నటి ఎవరు?’ అంటూ ఆమెని చూచాయగా చూపించారు. సదరు వీడియో చూసిన ప్రేక్షకులు.. ఆమె ఎవరై ఉంటారా? అని ఆలోచిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరి ఆ నటి ఎవరు? ఆమె చెప్పిన విశేషాలు తెలుసుకోవాలంటే ‘ఆలీతో సరదాగా’ 202వ ఎపిసోడ్‌ ప్రోమో వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని