ప్రభాస్ వాటిని నాకు గిఫ్ట్‌గా ఇచ్చాడు! - Actress Bhagya sri about Prabhas Radheshyam
close
Published : 02/11/2020 22:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్ వాటిని నాకు గిఫ్ట్‌గా ఇచ్చాడు!

హైదరాబాద్‌: ప్రభాస్‌ తనకు హైదరాబాద్‌ మిఠాయిలను గిఫ్ట్‌గా ఇచ్చాడని అలనాటి బాలీవుడ్‌ కథానాయిక భాగ్య శ్రీ తెలిపారు. ప్రభాస్‌ కథానాయకుడిగా రాధా కృష్ణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వింటేజ్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. పూజా హెగ్డే కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం భాగ్య శ్రీ కీలక పాత్రలో నటిస్తున్నారు.

చాలా రోజుల తర్వాత ఆమె రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘నేను ప్రభాస్‌ తల్లి పాత్రను ఒప్పుకోవడానికి అసలు కారణం తెలియాలంటే సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇలాంటి పాత్రలో ఇంతకుముందెప్పుడూ నటించలేదు. ‘ప్రభాస్‌ తల్లిగా మీరెలా సరిపోతారు’ అని చాలా మంది తనని అడిగారు. ఇదే విషయాన్ని దర్శకుడిని అడిగితే, ‘మీలా మీరు నటించండి చాలు. ప్రేక్షకులకు నచ్చేలా మీ పాత్రను తీర్చిదిద్దే బాధ్యత నాది’ అని సమాధామిచ్చారు. ఇక షూటింగ్‌ సమయంలో అందరూ నన్ను బాగా చూసుకునేవారు. సెట్‌లో ప్రభాస్‌ చక్కగా మాట్లాడేవారు. అప్పట్లో నేను కథానాయికగా నటించిన సినిమాలు చూసిన ప్రభాస్‌కు నాపై క్రష్‌ ఉండేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తన ఇంటికి తీసుకెళ్లి వెరైటీ వంటకాలతో కొసరికొసరి మరీ వడ్డించి  నాకు భోజనం పెట్టారు. వెళ్లేటప్పుడు హైదరాబాద్‌ మిఠాయి బాక్స్‌లను గిఫ్ట్‌ ఇచ్చారు’’ అని భాగ్య శ్రీ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణకుమార్‌ ట్విటర్‌ వేదికగా భాగ్యశ్రీకి ధన్యవాదాలు తెలిపారు. ‘‘రాధేశ్యామ్‌’లో భాగ్యశ్రీ మేడమ్‌ భాగస్వామి కావడంతో ఎంతో సంతోషం. మీతో పనిచేయడంతో అద్భుతమైన అనుభూతి’’ అని ట్వీట్‌ చేశారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని