close

తాజా వార్తలు

పెళ్లిపై కాజల్‌ ఏమన్నారంటే!

అమరావతి: విజయవాడ అంటే తనకు చాలా ఇష్టమని నటి కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. ఇక్కడి ప్రజలు నటిగా తననెంతో అభిమానిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని కాజల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత, సినీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. పట్టు చీరలంటే చాలా ఇష్టమని చెప్పారు. తన పెళ్లిపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని, త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పారు. నటుడు కమల్‌ హాసన్‌తో కలిసి బహుభాషా చిత్రం ఇండియన్‌-2లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నానన్నారు. మరోవైపు ఒక వెబ్‌ సిరీస్‌లో కూడా నటిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇతర భాషల్లో పలు సినిమాలతో బిజీగా ఉన్నట్లు కాజల్‌ తెలిపారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.