ఘనంగా కాజల్‌-గౌతమ్‌ వివాహ వేడుక - Actress Kajal weds Gautam Kitchlu
close
Updated : 31/10/2020 16:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఘనంగా కాజల్‌-గౌతమ్‌ వివాహ వేడుక

ముంబయిలోని తాజ్‌ ప్యాలెస్‌లో..

హైదరాబాద్‌: ముద్దుగుమ్మ ‘కాజల్’ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో శుక్రవారం రాత్రి ఆమె ఏడడుగులు వేశారు. లాక్‌డౌన్‌ కారణంగా అతి తక్కువ మంది అతిథుల మధ్య వీరి వివాహ వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. తన ప్రియసఖుడిని మనువాడే వేళ కాజల్‌ మోము పున్నమి ‘చందమామ’లా వెలిగిపోయింది. వివాహ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ జంటను చూసిన నెటిజన్లు ‘క్యూట్‌ పెయిర్, సూపర్‌ పెయిర్‌‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

‘లక్ష్మికల్యాణం’ చిత్రంతో కాజల్‌ తెలుగు తెరపై కథానాయికగా మొదటిసారి మెరిశారు. కథానాయికగా నటించిన రెండో చిత్రం ‘చందమామ’తో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో తెలుగుతోపాటు పలు దక్షిణాది భాషల్లో ఆమెకు అవకాశాలు వరుసకట్టాయి. టాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకలతోపాటు యువ హీరోలతో సైతం ఆమె ఆడిపాడారు. కేవలం గ్లామర్‌ రోల్స్‌లో మాత్రమే కాకుండా విభిన్నమైన  పాత్రల్లో సైతం కాజల్‌ నటించారు. మగధీర చిత్రంలోని ‘మిత్రమింద’, డార్లింగ్‌లోని ‘నందిని’, ‘నేనేరాజు నేనే మంత్రి’లోని ‘రాధ’ పాత్రలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆమె చిరంజీవితో ‘ఆచార్య’, కమల్‌హాసన్‌తో ‘ఇండియన్‌-2’, మంచువిష్ణుతో ‘మోసగాళ్లు’ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని ఆమె వెల్లడించిన విషయం విదితమే.

ఇదీ చదవండి
వధువు చందమామ.. వరుడి గురించి తెలుసా?

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని