అతను దొరక్కపోతే సింగిల్‌గానే ఉంటా: త్రిష - Actress Trisha opens up about her marriage plans
close
Published : 18/11/2020 12:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతను దొరక్కపోతే సింగిల్‌గానే ఉంటా: త్రిష

పెళ్లిపై నటి వ్యాఖ్యలు

హైదరాబాద్‌: దక్షిణాదికి చెందిన అగ్ర, యువ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చెన్నై ముద్దుగుమ్మ త్రిష. ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ అందాల రాశి పెళ్లి గురించి ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఆమె పెళ్లి కబురు చెప్పనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా త్రిష.. తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని వెల్లడించారు.

‘అన్ని విషయాల్లో నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను. అది కూడా ప్రేమ వివాహమే. అలాంటి వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా వివాహ బంధంలోకి అడుగుపెడతాను. అప్పటివరకూ సింగిల్‌గా ఉండడానికి ఇబ్బంది లేదు. ఒకవేళ సరైన జీవిత భాగస్వామి దొరక్కపోతే ఎలాంటి బాధా లేకుండా ఎప్పటికీ సింగిల్‌గానే ఉండగలను’ అని త్రిష తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కోలీవుడ్‌కు చెందిన ఓ నిర్మాతను వివాహం చేసుకోవాలని త్రిష భావించారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. అనంతరం ఆమె వృత్తి జీవితంలో బిజీ అయ్యారు. అయితే, తమిళ నటుడు శింబుని త్రిష పెళ్లి చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజులగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి శింబు తండ్రి టి.రాజేందర్‌ని అడగ్గా ఆయన స్పందించకపోవడంతో పెళ్లి వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని