
తాజా వార్తలు
‘తాప్సీ.. నువ్వు చెత్త హీరోయిన్‌వి’
నెటిజన్ కామెంట్.. నటి రిప్లై
ముంబయి: దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ కథానాయికగా సత్తా చాటిన ముద్దుగుమ్మ తాప్సీ. ‘ఝుమ్మందినాదం’తో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. ఆపై పలు సినిమాల్లో నటించినప్పటికీ తెలుగులో ఆశించిన బ్రేక్ రాలేదు. హిందీ చిత్రం ‘పింక్’ (2016) నుంచి తాప్సీ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ‘నామ్ షబానా’, ‘జుడ్వా 2’, ‘ముల్క్’, ‘బద్లా’, ‘మిషన్ మంగళ్’, ‘తప్పడ్’ తదితర సినిమాలు ఆమెను స్టార్ చేశాయి.
తాప్సీ ప్రస్తుతం తన తర్వాతి సినిమా ‘రష్మీ రాకెట్’లో నటిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం మైదానంలో చమటోడుస్తున్నారు. ఈ క్రమంలో తీసిన ఫొటోల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఓ నెటిజన్ వాటికి రిప్లై ఇస్తూ.. తాప్సీ నటనను విమర్శించాడు. ‘నీకు నటన రాదు. ఎత్తుకుని, ఎత్తుకుని (ఎంచుకుని) సినిమాలు చేస్తున్నావు. నువ్వు ‘ఫాల్తూ’ హీరోయిన్’ అని తప్పుపట్టాడు. దీనికి తాప్సీ తన స్టైల్లో రిప్లై ఇచ్చారు. ‘ఏం ఎత్తుకుని సినిమాలు చేస్తున్నాను? ఇప్పటికే నా ఇమేజ్ను పైకి ఎత్తుకున్నా. ఆ విషయం నీకే అర్థం కావడం లేదు’ అని బదులిచ్చారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
