పది తలల రావణునిగా సైఫ్‌ అలీఖాన్‌...! - Adipurush: Saif Ali Khan opens up on his role of Lankesh in the Prabhas starrer
close
Published : 05/12/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పది తలల రావణునిగా సైఫ్‌ అలీఖాన్‌...!

హైదరాబాద్‌:  ప్రభాస్‌ నటించనున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకేష్‌ పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రంలోని ‘లంకేష్‌’ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో పది తలకాయలతో బాలీవుడ్‌ నటుడు ‘రావణునిగా’ కనిపించారు. అంతేకాకుండా కింది భాగంలో ‘బాణం పట్టుకొని రాముని’ రూపం ఉంది.

ఈ చిత్రంలోని తన పాత్రను దర్శకుడు ఓం రావత్‌ చాలా అద్భుతంగా మలిచారన్నారు. అంతేకాకుండా ‘ఇలాంటి రాక్షసప్రభువు వంటి పాత్ర చేయటం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ, సీతని అపహరించినందుకు, రామునితో యుద్దానికి దారి తీసిన పరిస్థితులను, తన చెల్లి శూర్పణఖ విషయంలో లక్ష్మణుడు చేసిన పనికి ప్రతీకారం తీసుకునేందుకు.. వీటన్నింటికీ న్యాయం చేస్తూ ఎంటర్‌టైనింగ్‌గా మనిషిగా చూపించే ప్రయత్నం చేశారు’.అని మొదటిసారిగా ఈ చిత్రంలోని తన పాత్ర గురించి సైఫ్‌ తెలిపారు.

ఈ చిత్రంలో కృతి సనన్‌ ‘సీత’ పాత్రలో కథానాయికగా నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే ‘అవతార్‌’, ‘స్టార్‌ వార్స్‌’ చిత్రాల వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్స్‌తో ఈ చిత్రానికి సంబంధించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. గ్రీన్‌ మ్యాట్‌ టెక్నాలజీపై ఈ చిత్ర నిర్మాణం జరగనుంది. ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో ఆగస్టు 11న, 2022లో విడుదల చేయనున్నారు. 

 


 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని