వాళ్లిద్దరూ పదేళ్లు సహజీవనం చేశారు - Aditya Narayan and Shweta Agarwal were in livein relationship for 10 years says Udit
close
Updated : 06/12/2020 14:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లిద్దరూ పదేళ్లు సహజీవనం చేశారు

ఉదిత్‌ నారాయణ్‌

ముంబయి: ‘అందమైన ప్రేమరాణి’, ‘అందాల ఆడబొమ్మ’, ‘కీరవాణి రాగంలో’, ‘పసిఫిక్‌లో దూకేమంటే’, ‘అమ్మాయే సన్నగా’.. ఇలా ఎన్నో మధురమైన పాటలు పాడి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌. ఆయన కుమారుడు ఆదిత్య నారాయణ్‌ ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నటి శ్వేతాఅగర్వాల్‌ను ఆదిత్య ప్రేమించి వివాహం చేసుకున్నారు. డిసెంబర్‌ 1న ముంబయిలోని ఇస్కాన్‌ మందిరంలో వీరిద్దరి వివాహం వేడుకగా జరిగింది. ఈ నేపథ్యంలో తన కుమారుడు ఆదిత్య ప్రేమ, పెళ్లి గురించి తాజాగా ఉదిత్‌ నారాయణ్‌ స్పందించారు.

‘నాకు ఆదిత్య ఒక్కడే సంతానం. వాడి వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయాలనుకున్నా. కొవిడ్‌-19 కారణంగా భారీ వేడుకలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కరోనా వైరస్‌ పరిస్థితులు కొంచెం చక్కబడే వరకూ నా కొడుకు పెళ్లి వాయిదా వేయాలనుకున్నా. కాకపోతే ఆదిత్య-శ్వేతా, ఆమె తల్లిదండ్రులు.. ఇప్పుడు పెళ్లి జరిగితే బాగుంటుందని భావించారు. మా కొడుకు ఆదిత్య, శ్వేత పదేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. ఇప్పుడు తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నా’

‘శ్వేతా అగర్వాల్‌ ఒద్దికైన అమ్మాయి. చాలా తక్కువగా మాట్లాడుతుంది. ఆదిత్య కోసం మేం ఎన్నో సంబంధాలు చూశాం. కానీ ఓరోజు ఆదిత్య మా దగ్గరికీ వచ్చి శ్వేతను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మొదట మేం కొంచెం షాక్‌ అయ్యాం. ఎన్నో ఏళ్లుగా స్నేహితులైన వాళ్లిద్దరూ ఇప్పుడు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టడం నాకెంతో ఆనందంగా ఉంది’ అని ఉదిత్‌ తెలిపారు.

ఇవీ చదవండి

ప్రభాస్‌ పాత్ర పోషించడానికి భయం లేదు

జేమ్స్‌బాండ్‌ను బీట్‌ చేసిన అల్లు అర్జున్‌Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని