పాతికేళ్ల తర్వాత తెరముందుకొచ్చిన ఉత్తమనటి..! - After Twenty Five Years Actress Archana Came in Front of Camera
close
Published : 14/11/2020 17:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాతికేళ్ల తర్వాత తెరముందుకొచ్చిన ఉత్తమనటి..!

హైదరాబాద్‌: ‘నిరీక్షణ’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘మట్టి మనుషులు’ లాంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అలనాటి నటి ‘అర్చన’. ఉత్తమ నటిగా వరుసగా రెండుసార్లు జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అర్చన.. చాలాకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. దాదాపు పాతికేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి ఆమె కెమెరా ముందుకు వచ్చారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో అర్చన పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కమర్షియల్‌, గ్లామర్‌ చిత్రాల్లో నటిస్తున్న తరుణంలో ఒక్కసారిగా ‘నిరీక్షణ’ లాంటి సినిమాని ఓకే చేసి అందులో నటించడం ఓ సాహసమేనని, ఇటీవల విడుదలైన ‘మహానటి’, ‘జనతా గ్యారేజ్’ చిత్రాలు తనకి బాగా నచ్చాయని ఆమె వివరించారు. 1988, 1989లో వరుసగా రెండుసార్లు తాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డునందుకున్నానని అన్నారు. అంతేకాకుండా పాతికేళ్ల తర్వాత తాను ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని.. ఇప్పటివరకూ ఏ భాషలో కూడా అలాంటి కథ రాలేదని.. ఆమె వివరించారు. తన కలర్‌ గురించి, సినిమా పరిశ్రమ పట్ల తనకున్న ఇష్టం గురించి అర్చన చెప్పిన ఎన్నో విశేషాలు తెలుసుకోవాలంటే వచ్చే సోమవారం వరకూ వేచి ఉండాల్సిందే. నవంబర్‌ 16న ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ ప్రోమో చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని