మొన్న పెట్రోల్‌కు.. నేడు డీజిల్‌కు.. - After petrol diesel demand returns to pre-COVID-19 level
close
Published : 16/10/2020 22:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొన్న పెట్రోల్‌కు.. నేడు డీజిల్‌కు..

క్రమంగా పెరుగుతున్న డిమాండ్‌


దిల్లీ: లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపు తర్వాత పరిస్థితులు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయి. గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్‌కు క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా డీజిల్‌ అమ్మకాల్లో కొవిడ్‌కు ముందున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ అక్టోబరు మొదటి అర్ధభాగంలోనే 8.8 శాతం అధికంగా అమ్మకాలు పెరిగాయి. లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి ఈసారి డీజిల్‌ అమ్మకాలలో ఇదే మొదటి వార్షిక పెరుగుదల. దేశంలో అత్యధికంగా ఉపయోగించే ఇంధనం డీజిలే. అయితే కొవిడ్‌ కారణంగా చాలామంది దూర ప్రయాణాలు చేయడానికి ప్రజారవాణా కంటే వ్యక్తిగత వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల పెట్రోల్‌కు డిమాండ్‌ పెరిగింది. అయితే అక్టోబరు మొదటి అర్ధభాగంలో మాత్రం డీజిల్‌ అమ్మకాలలో పెరుగుదల ఉంది. పెరుగుతున్న డిమాండ్‌, రాబోయే పండుగ సీజన్‌.. అమ్మకాలకు తోడ్పడుతుందని ముందే ఊహించారు. కానీ దానికంటే ముందుగానే,  మొదటి పదిహేను రోజుల్లో  ఏడాది క్రితంతో పోల్చినపుడు 2.43 మిలియన్‌ టన్నుల నుంచి 2.65 మిలియన్‌ టన్నుల డీజిల్‌ అమ్మకాలు జరిగాయి. 

గత నెలలో పెట్రోల్‌ అమ్మకాల్లో కొవిడ్‌కు ముందున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అమ్మకాల్లో  గత ఏడాది కంటే  1.5 శాతం పెరుగుదల నమోదైంది. మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన తరువాత పెట్రోల్‌, డీజిల్‌ వంటి వాటికి డిమాండ్‌ బాగా తగ్గింది. చమురు డిమాండ్‌ 49 శాతం పడిపోయింది. అయితే సడలింపులు ఇవ్వడం, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావటంతో జూన్‌ నుంచి ఇంధనాలకు డిమాండ్‌ పెరగసాగింది. సెప్టెంబరులో కూడా నెలవారీగా అమ్మకాల్లో పెరుగుదల కనిపించింది. ఆ నెలలో రికవరీ రేటు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండిందని ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీకాంత్‌ మహదేవ్‌ వైద్య గురువారం పేర్కొన్నారు. ఈ త్రైమాసికంలో చమురు డిమాండ్‌ పెరిగిందన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి కొవిడ్‌కు ముందున్న పరిస్థితి ఏర్పడాలన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని