ఎయిరిండియాకు లభించే బీమా మొత్తం ఎంతంటే - Air India Express to get this amount of insurance claim
close
Published : 11/08/2020 23:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎయిరిండియాకు లభించే బీమా మొత్తం ఎంతంటే

చెన్నై: కొలికోడ్‌ విమాన ప్రమాద ఘటనలో ధ్వంసమైన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఎయిర్‌ ఇండియా స్వంతమని... లీజుకు తీసుకున్నది కాదని అధికారులు స్పష్టం చేశారు. ఎయిర్‌ ఇండియా ఆధీనంలో ఉన్న మొత్తం 25 (ప్రమాదానికి ముందు) బోయింగ్‌ విమానాల్లో 17 స్వంతం కాగా, మిగిలిన ఎనిమిది లీజుకు తీసుకున్నవని వారు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గురైన ఐఎక్స్‌ 1355 విమానానికి సబంధించిన బీమా మొత్తం ఎయిరిండియాకు లభించనుంది. కాగా, విమానానికి పూర్తి బీమా మొత్తం 50 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.373 కోట్లు చెల్లించేందుకు బీమా కంపెనీల కన్సార్టియం అంగీకరించినట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన విమానంతో సహా మరో 170 ఎయిరిండియా విమానాలకు.. న్యూ ఇండియా అస్యూరెన్స్‌, నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ల కన్సార్టియం బీమా కల్పించింది.
ఇక ప్రమాదంలో మృతులు, గాయపడిన వారికి పరిహారంగా లభించాల్సిన మొత్తాన్ని గురించి న్యాయనిపుణుల బృందం కృషి చేస్తోంది. దీనిలో ప్రయాణీకుల వద్దనున్న వస్తువుల విలువను కూడా పరిగణిస్తారు. ఈ మొత్తాన్ని మాంట్రియల్‌ ఒప్పందం ప్రకారం లెక్కిస్తారు. ఇది సగటున ఒకొక్కరికి 1,75,000 డాలర్లు కావచ్చని అంచనా. ఈ విధంగా చూస్తే ఈ దుర్ఘటనకు సంబంధించి ఎయిర్‌ ఇండియాకు ఇంచుమించు 750 మిలియన్ డాలర్ల బీమా మొత్తం లభించాల్సి ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని