మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా: ఐశ్వర్య - Aishwarya Rai Says Hurtful Thanks To Fans
close
Published : 29/07/2020 12:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా: ఐశ్వర్య

ముంబయి: కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న నటి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఆమెతోపాటు ఆరాధ్య, అమితాబ్‌, అభిషేక్‌ బచ్చన్‌కు కరోనాపాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో వారు చికిత్స పొందారు. రెండు రోజుల క్రితం చేసిన పరీక్షల్లో ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగెటివ్‌ రావడంతో వారిద్దరూ ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్య తన ఇన్‌స్టా వేదికగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. 

‘‘ప్రత్యేకించి మా కోసం మీరు చేసిన ప్రార్థనలకు, చూపిన ప్రేమకు నా ధన్యవాదాలు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మీ పట్ల నా నిజమైన ప్రేమ, ప్రార్థనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అందరూ సురక్షితంగా, సంతోషంగా ఉండండి’’ అంటూ పోస్టు చేశారు. ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌లు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. బిగ్‌బి కుటుంబంలో జయాబచ్చన్‌ ఒక్కరే సురక్షితంగా ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని