అజిత్‌కు గాయాలు.. చెన్నై వెళ్లిన హీరో - Ajith gets injured during Valimai action sequence shoot
close
Updated : 20/11/2020 12:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అజిత్‌కు గాయాలు.. చెన్నై వెళ్లిన హీరో

చెన్నై‌: అగ్ర కథానాయకుడు అజిత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వలిమై’. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవల హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమయ్యింది. అజిత్‌పై పలు కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్‌ సీక్వెన్స్‌ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. అయితే, పదిరోజుల క్రితం ‘వలిమై’ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అజిత్‌కు స్వల్ప గాయాలయ్యాయని, చికిత్స తీసుకుంటూ ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తాజాగా హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తి కావడంతో ఆయన ఇంటికెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది.

మరోవైపు మరికొన్ని రోజుల్లో ‘వలిమై’కు సంబంధించిన మరో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘వలిమై’ చిత్రానికి బోనీకపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో హ్యుమా కూరేషి, టాలీవుడ్‌ నటుడు కార్తికేయ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు అందిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని