రఘుకుంచె లైవ్‌ అదుర్స్‌..! - Akka Evare Athagadu Latest Promo
close
Published : 15/10/2020 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రఘుకుంచె లైవ్‌ అదుర్స్‌..!

సెలబ్రిటీలు ఫిదా.. హోరెత్తిన స్జేజ్‌

హైదరాబాద్‌: సంగీత దర్శకుడు, గాయకుడు రఘుకుంచె ‘నక్కిలీసు గొలుసు’ సాంగ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. దసరా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈటీవీలో ‘అక్కా ఎవరే అతగాడు’ అనే ప్రత్యేక ఈవెంట్‌ ప్రసారం కానుంది. ఇప్పటికే షూటింగ్‌ జరుపుకున్న ఈ వేడుకకు సంబంధించిన ప్రోమో తాజాగా వీక్షకుల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. అలనాటి నటి సంగీతకు ఇద్దరు చెల్లెళ్లుగా రష్మి, వర్షిణి ఈవెంట్‌లో హంగామా చేశారు.

కాగా, పండుగ వేడుకలో పాల్గొన్న నవదీప్‌.. రష్మి, వర్షిణిలపై వేసిన పంచులు నవ్వులు పూయించేలా ఉన్నాయి. శేఖర్‌ మాస్టర్‌, నవదీప్‌, సుధీర్‌లను ఉద్దేశిస్తూ రాంప్రసాద్‌ అండ్‌ గ్యాంగ్‌ చేసిన స్కిట్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది. స్కిట్‌లో భాగంగా రాంప్రసాద్‌, సుధీర్‌.. పరస్పరం వేసుకున్న పంచులతోపాటు వారు క్రియేట్‌ చేయనున్న వాట్సాప్‌ గ్రూప్‌ పేర్లు కూడా హైలెట్‌గా ఉన్నాయి.

ఫన్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతోన్న ఈవెంట్‌ని రఘుకుంచె తన సంగీతంతో మరింత జోష్‌ఫుల్‌గా మార్చారు. ఇటీవల ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన ‘నక్కిలీసు గొలుసు’ పాటను ఈవెంట్‌లో ఆలపించారు. పాట మధ్యలో దుర్గారావు దంపతులు సైతం స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చి స్టెప్పులేశారు. దాంతో స్టేజ్‌పై ఉన్న తారలందరూ ఫిదా అయ్యారు. సుధీర్‌ సైతం స్టెప్పులేయడంతో స్టేజ్‌ హోరెత్తిపోయింది. అనంతరం ‘రంగమ్మా.. మంగమ్మా’ అంటూ రష్మి వేసిన స్టెప్పులు చూసి శేఖర్‌ మాస్టర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. మరికొన్ని రోజుల్లో ప్రసారం కానున్న దసరా ఈవెంట్‌ ప్రోమో చూసేయండి..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని