నటి సంగీత కన్నీటి పర్యంతం..! - Akka Evare Athagadu Latest Promo
close
Updated : 18/10/2020 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నటి సంగీత కన్నీటి పర్యంతం..!

ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేస్తున్న వీడియో  

హైదరాబాద్‌: ‘ఒక్కఛాన్స్‌ ఒకే ఒక్క ఛాన్స్‌’ అంటూ అమాయకపు చూపులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి సంగీత. ‘ఖడ్గం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే తాజాగా ఆమె ఓ ఈవెంట్‌లో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. సంగీతతోపాటు అదే ఈవెంట్‌లో పాల్గొన్న పలువురు టాలీవుడ్‌ కమెడియన్ల కుటుంబ సభ్యులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

దసరా పండుగను పురస్కరించుకుని ఈటీవీలో ‘అక్కా ఎవరే అతగాడు?’ అనే పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుంది. ఇందులో భాగంగా సంగీత.. పూజకు వచ్చిన వారిలో మంచి అబ్బాయిలను సెలక్ట్‌ చేసి.. తన ఇద్దరు చెల్లెళ్లకు(రష్మి, వర్షిణి) పెళ్లి చేయాలని భావిస్తుంది. సంగీత ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో శేఖర్‌ మాస్టర్‌, నవదీప్‌, సుధీర్‌ పాల్గొని వారి టాలెంట్స్‌ని బయటపెడతారు.

కాగా, త్వరలో ప్రసారం కానున్న ‘అక్కా ఎవరే అతగాడు?’ ప్రోగ్రామ్‌కి సంబంధించిన సరికొత్త ప్రోమో ఇప్పుడు అందరి మనసులను కదిలిస్తోంది. ఈవెంట్‌లో భాగంగా.. ఒకానొక సమయంలో తెలుగిళ్లలో నవ్వులు పూయించి.. పలు కారణాల వల్ల మృతి చెందిన టాలీవుడ్‌ హాస్యనటుల గురించి పలువురు కమెడియన్లు ఓ స్కిట్‌ చేశారు. అయితే ఈ స్కిట్‌లో భాగంగా.. ‘దసరా ఈవెంట్‌ చాలా బాగా జరిగింది. వచ్చిన పని అయిపోయింది. పైనుంచి పిలుపొచ్చింది. వెళ్లాలి’ అంటూ ఆనాటి హాస్యనటులు భావోద్వేగానికి గురైనట్లు చూపించారు. దీంతో ఈవెంట్‌లో పాల్గొన్న సదరు హాస్యనటుల కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. అదే సమయంలో నటి సంగీత సైతం కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.  త్వరలో ప్రసారం కానున్న ‘అక్కా ఎవరే అతగాడు?’ ఈవెంట్‌కి సంబంధించిన సరికొత్త ప్రోమో చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని