సుధీర్‌కి నవదీప్ కౌంటర్‌‌..! - Akka Evare Athagadu Promo
close
Published : 12/10/2020 12:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుధీర్‌కి నవదీప్ కౌంటర్‌‌..!

రష్మి, వర్షిణి కోసం తారల పాట్లు

హైదరాబాద్‌: ‘గల్లీలో సిక్స్ ఎవరైనా కొడతారు.. స్టేడియంలో సిక్స్‌ కొట్టేవాడికే ఒక రేంజ్‌ ఉంటుంది’ అంటూ సుధీర్‌పై కౌంటర్‌ వేస్తున్నారు నటుడు నవదీప్‌. అంతేకాకుండా ‘దమ్ముంటే నన్నాపు’ అంటూ సుధీర్‌కి ఛాలెంజ్‌ కూడా చేశారు. రష్మి, వర్షిణిల కోసమే వీరిద్దరూ ఇంతలా కౌంటర్లు వేసుకుంటున్నారు. విజయదశమి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ఈటీవీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది కూడా ప్రేక్షకులను అలరించడానికి.. ప్రతి ఒక్కరి ఇంట్లో పండగ వాతావరణాన్ని నెలకొల్పడానికి ఈటీవీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘అక్కా ఎవరే అతగాడు?’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.

కాగా, పండుగ ఈవెంట్‌లో భాగంగా నటి సంగీత తన ఇద్దరు చెల్లెళ్లకు (రష్మి, వర్షిణి) పెళ్లి చేయాలనుకుంటారు. అందుకోసం పండుగపూట పూజ చేయడానికి వచ్చిన వాళ్లలో మంచి వాళ్లని సెలక్ట్‌ చేయాలనుకుంటారు. అయితే ఈ పూజా కార్యక్రమంలో సుధీర్‌, నవదీప్‌, శేఖర్‌ మాస్టర్‌తోపాటు సింగర్స్‌, పలువురు కమెడీయన్లు కూడా పాల్గొంటారు. ఈవెంట్‌లో భాగంగా రష్మి, వర్షిణితో శేఖర్‌ వేసిన స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

సుధీర్‌-రష్మి సైతం డ్యాన్స్‌తో మరోసారి తమ అభిమానులకు కనులవిందు అందించారు. మరి, సంగీత తన ఇద్దరు ముద్దుల చెల్లెళ్లకు పెళ్లి చేశారా? రష్మి, వర్షిణిని పరిణయమాడిన వ్యక్తులు ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇలోగా ‘అక్కా ఎవరే అతగాడు’ ప్రోమో చూసేయండి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని