నాగ్‌-అఖిల్‌ మల్టీస్టారర్‌ నిజమేనా..? - Akkineni Nagarjuna Akhil and Anil Ravipudi come together for a film
close
Published : 15/11/2020 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగ్‌-అఖిల్‌ మల్టీస్టారర్‌ నిజమేనా..?

హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున.. ఆయన తనయుడు అఖిల్‌.. ఓ సినిమా కోసం కలిసి పనిచేయనున్నారని తెలుస్తోంది. ఏయన్నార్‌ - నాగార్జున - నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మనం’ చిత్రంలో అఖిల్‌ ఓ అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. దీంతో నాగార్జున - తన ఇద్దరు తనయులతో కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని తాజాగా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి.. నాగ్‌-అఖిల్‌తో ఓ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేసినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.

‘ఎఫ్‌-2’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు చూసిన నాగ్‌.. అనిల్‌తో కలిసి పనిచేయాలనుకున్నారని.. దీంతో సదరు దర్శకుడు.. ఓ మంచి కథను సిద్ధం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనిల్‌ సిద్ధం చేసిన కథ తనకి నచ్చడంతో నాగార్జున ఓకే అన్నారని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

‘సరిలేరు నీకెవ్వరు’ విజయం తర్వాత అనిల్‌ రావిపూడి.. ‘ఎఫ్‌-3’ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ‘ఎఫ్‌-3’ సినిమా కొంతకాలంపాటు వాయిదా వేసి.. నాగార్జునతో మల్టీస్టారర్‌ నిర్మించాలనే ఉద్దేశంలో అనిల్‌ ఉన్నట్లు కథనాలు దర్శమిస్తున్నాయి. నాగ్‌తో సినిమా గురించి అనిల్‌ రావిపూడి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని