‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’ మొదటి అడుగు పడింది - Akkineni Nagarjuna start big boss shoot
close
Updated : 12/08/2020 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’ మొదటి అడుగు పడింది

హైదరాబాద్‌: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఇంతకాలం ఈ షో పట్ల సందిగ్ధత నెలకొనగా, ఇటీవల నిర్వాహకులు టీజర్‌తో స్పష్టత ఇచ్చారు. తాజాగా బిగ్‌బాస్‌కు సంబంధించి మొదటి అడుగు పడింది. ‘సీజన్‌-4’ టీజర్‌ షూటింగ్‌ షురూ చేశారు.

తన వాక్పటిమ, చతురతతో గత సీజన్‌ను రక్తికట్టించిన అగ్ర కథానాయకుడు నాగార్జున ఈసారి కూడా అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా జరిగిన యాడ్‌ షూటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో ఈ షూటింగ్‌ జరిగింది. ‘సోగ్గాడే చిన్నినాయన’ దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దీనికి దర్శకత్వం వహించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ చిత్రీకరించారు. త్వరలోనే ఈ యాడ్‌ను విడుదల చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు బిగ్‌బాస్‌ సీజన్‌-4లో పాల్గొనే వారి జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఇది ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ సీజన్‌లో పాల్గొనే వారికి ముందుగానే కొవిడ్‌-19 పరీక్షలు చేసి, క్వారంటైన్‌కు తరలిస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణ అయిన తర్వాతే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనుమతిస్తారు. కరోనా కారణంగా ఈసారి బిగ్‌బాస్‌ను మరింత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.  ఎవరెవరు ఈ సారి హౌస్‌లోకి వెళ్తారో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని