అందుకే రోజూ గోమూత్రం తాగుతా: అక్షయ్‌ - Akshay Kumar Says He Drinks Cow Urine Daily for ayurvedic reasons
close
Published : 12/09/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే రోజూ గోమూత్రం తాగుతా: అక్షయ్‌

ఇంటర్నెట్ డెస్క్‌: తాను రోజూ గో మూత్రం తాగుతానని బాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రాల కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ అన్నారు. ప్రముఖ సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌తో కలిసి ఆయన సాహసాలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి ఈ ఎపిసోడ్‌ డిస్కవరీ ప్లస్‌ యాప్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్షయ్‌ నటి హ్యుమా ఖురేషి, బేర్‌ గ్రిల్స్‌తో కలిసి మాట్లాడిన వీడియోను తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా ‘ఏనుగు టీ’ తాగడానికి అక్షయ్‌ ఎలా ఒప్పుకున్నారని హ్యుమా ప్రశ్నించింది. దీనికి అక్షయ్‌ స్పందిస్తూ, ‘ఏనుగు టీ తాగడానికి నేనేమీ కంగారు పడలేదు. ఎందుకంటే ఆయుర్వేదం తెలిపిన ప్రకారం నేను రోజూ గో మూత్రం తాగుతా. కాబట్టి నాకు పెద్ద తేడా ఏమీ అనిపించలేదు. గోమూత్రం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి’ అని సమాధానం ఇచ్చారు. అక్షయ్‌ గోమూత్రం తాగడం గురించి చెప్పడంతో దానివల్ల కలిగే లాభాల గురించి ఆయన అభిమానులు వేలమంది గూగుల్‌లో శోధించారు.

తాజా ఎపిసోడ్‌ను కర్ణాటకలోని బందిపొరా వన్యప్రాణి సంరక్షణ జాతీయ ఉద్యానవనంలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా తనతో బేర్‌ గ్రిల్స్ మరో సీక్వెల్‌ చేయాలని అక్షయ్‌ కోరారు. మరోవైపు అక్షయ్‌కుమార్‌ను బేర్‌ గ్రిల్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. అక్షయ్‌తో పనిచేయడం సరదాగా ఉంటుందని, స్టార్‌ హీరో అన్న గర్వం ఆయనకు అస్సలు లేదని తెలిపాడు. అక్షయ్‌ శారీరక దారుఢ్యానికి తాను మంత్రముగ్ధుడినైనట్లు తెలిపాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని