పబ్‌జీకి పోటీగా.. అక్షయ్‌ ‘ఫౌజీ‌’! - Akshay Kumar announces multiplayer game FAU-G
close
Updated : 04/09/2020 18:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పబ్‌జీకి పోటీగా.. అక్షయ్‌ ‘ఫౌజీ‌’!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో పబ్‌జీ గేమ్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మల్టీ ప్లేయర్‌ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ ఉద్యమంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. దీనికి ‘ఫౌజీ’ (ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌ గార్డ్స్‌) అని పేరుపెట్టారు. త్వరలో ఈ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు.

‘‘ప్రధాని పిలుపునిచ్చిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ఉద్యమంలో భాగంగా ‘ఫౌజీ’‌ను తీసుకొస్తున్నాం. కేవలం వినోదమే కాదు.. మన సైనికుల త్యాగాలను తెలియజేయబోతున్నాం. ఈ గేమ్‌ ద్వారా సమకూరే ఆదాయంలో 20 శాతం ‘భారత్‌కా వీర్‌ ట్రస్ట్‌’కు అందజేయనున్నాం’’ అని అక్షయ్‌ సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చారు. గేమ్‌కు సంబంధించిన పోస్టర్‌ను పంచుకున్నారు. దీన్ని బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్‌ గేమ్స్‌ రూపొందించింది. అక్షయ్‌ దీనికి మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల టెన్సెంట్‌ గేమ్స్‌కు చెందిన పబ్జీ సహా 118 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో పబ్జీ ప్లేయర్లు నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో అక్షయ్‌ ‘ఫౌజీ‌’ పేరుతో ముందుకు రావడం గమనార్హం. అక్షయ్‌ పోస్టు చేసిన వెంటనే పలువురు సంతోషం వ్యక్తంచేశారు. గేమ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పోస్ట్‌ చేస్తున్నారు. అక్షయ్‌ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘బెల్‌ బోటమ్‌’ చిత్రీకరణ నిమిత్తం యూకేలో ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని