రూ.500 కోట్లకు పరువునష్టం దావా వేసిన అక్షయ్‌ - Akshay Kumar’s Rs 500 Crore Defamation Suit on YouTuber
close
Published : 19/11/2020 22:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.500 కోట్లకు పరువునష్టం దావా వేసిన అక్షయ్‌

ముంబయి: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతికి సంబంధించి తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిపై బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ రూ.500 కోట్ల పరువునష్టం దావా వేశారు. బిహార్‌కు చెందిన రషీద్‌ సిద్దిఖీ అనే వ్యక్తి ఎఫ్‌ఎఫ్‌ న్యూస్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించి.. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతికి సంబంధించి ఎన్నో అసత్య కథనాలు పోస్ట్‌ చేశాడు.

భారీ బడ్జెట్ చిత్రాల్లో సుశాంత్‌కు అవకాశాలు రావడం అక్షయ్‌కి నచ్చలేదని..  రియా చక్రవర్తి కెనడా పారిపోవడానికి అక్షయ్‌ సాయం చేశాడని పేర్కొంటూ పలు వీడియోలను నెట్టింట్లో  పోస్ట్‌ చేసి.. రషీద్‌ డబ్బులు సంపాదించాడు. దీంతో రషీద్‌ సిద్దిఖీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అసత్య ప్రచారాలు చేయడం వల్ల తాను నాలుగు నెలల్లో రూ.15 లక్షలు సంపాదించినట్లు వెల్లడించాడని పలు వార్తా పత్రికల్లో కథనాలు ప్రచూరితమయ్యాయి. కాగా, రషీద్‌ గురించి తెలుసుకున్న అక్షయ్‌ తాజాగా అతనిపై స్థానిక కోర్టులో భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని