నెట్‌ఫ్లిక్స్‌లోనూ ‘అలవైకుంఠపురములో’ జోరు - Ala Vaikunthapurramuloo in Netflix top 10 most watched films of 2020
close
Published : 11/12/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెట్‌ఫ్లిక్స్‌లోనూ ‘అలవైకుంఠపురములో’ జోరు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది ‘అలవైకుంఠ పురములో’ ఓ సంచలనమే సృష్టించింది. ఈ సినిమా పాటలు దేశాల సరిహద్దులు దాటి తెలుగు రాని విదేశీయులతోనూ స్టెప్పులేయించాయి. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టింది. సరే.. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. కరోనా ప్రభావంతో థియేటర్లన్నీ మూతపడ్డా బన్నీ సినిమా మాత్రం రికార్డులు తిరగరాస్తూనే ఉంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో దక్షిణాదిలో అత్యధికంగా చూసిన సినిమాల్లో టాప్‌-10 చిత్రాలను ఆ సంస్థ ప్రకటించింది. దీనిలో బన్నీ నటించిన ‘అలవైకుంఠపురములో’ చిత్రం తొలిస్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో దుల్కర్‌ సల్మాన్ నటించిన తమిళ చిత్రం‌ ‘కన్నం కన్నం కొల్లయ్యదితల్‌’, అన్నాబెన్‌ నటించిన మలయాళ చిత్రం ‘కప్పెలా’, సత్యదేవ్‌ నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఉన్నాయి. 

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ విజయాల తర్వాత త్రివిక్రమ్‌-బన్నీ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం ‘అలవైకుంఠపురములో’. బన్నీ సరసన పూజా హెగ్డే నటించింది. టబు, సుశాంత్‌, సునీల్‌, నివేదా పేతురాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. తమన్‌ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టడంతో పాటు మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మించారు. 

టాప్‌10లో చోటు సంపాదించిన మరో సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో కనిపించాడు. కరోనా మహమ్మారి ప్రభావంతో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది జులై 30న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, విజయప్రవీణ పరుచూరి నిర్మించారు.

ఇదీ చదవండి..

అల్లు అర్జున్‌ చిత్రం సరికొత్త రికార్డుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని