జేమ్స్‌బాండ్‌ను బీట్‌ చేసిన అల్లు అర్జున్‌ - AlaVaikunthapurramuloo is among the TOP 20 Most Viewed Trailers 2020 on IMDb
close
Published : 06/12/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జేమ్స్‌బాండ్‌ను బీట్‌ చేసిన అల్లు అర్జున్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ హాలీవుడ్‌ ‘జేమ్స్‌ బాండ్‌’ను బీట్‌ చేశారు. మీరు చదివింది నిజమే.. ‘అల వైకుంఠపురములో..’ ట్రైలర్‌ ‘జేమ్స్‌ బాండ్‌: నో టైమ్‌ టు డై’ ట్రైలర్‌ వ్యూస్‌ను అధిగమించింది. ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా సరికొత్త మైలురాయి అందుకుంది. ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన టాప్‌-20 ట్రైలర్ల జాబితాలో చోటుదక్కించుకుంది. ఇందులో దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి కేవలం బన్నీ చిత్రం మాత్రమే ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో అభిమానులు సోషల్‌ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 6,289 ట్వీట్లతో AlaVaikunthapurramuloo హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బన్నీ, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ఇది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని విజయం సాధించింది. చిత్రం రూ.262 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.
టాప్‌-10 ట్రైలర్ల జాబితాలో..
1. ఆఫ్టర్ వి కొలైడెడ్
2. బాట్మాన్
3. డూన్
4. టెనెట్‌
5. బ్యాడ్‌ బాయ్స్‌ ఫర్‌ లైఫ్‌
6. బాఘి 3
7. అల వైకుంఠపురములో..
8. ది ఇన్విజిబుల్‌ మెన్‌
9. జేమ్స్‌బాండ్‌: నో టైమ్‌ టు డై
10. వాండా విజన్‌.. తదితర చిత్రాలు ఉన్నాయి.

ఇవీ చదవండి..

నిహారిక పెళ్లికూతురాయనే..

రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ వెనుక ఆరేళ్ల కష్టం

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని