నా పేరుతో ట్విటర్‌లో ఫేక్‌ అకౌంట్‌: ఆలీ - Ali Complaint against twitter fake account
close
Published : 19/07/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా పేరుతో ట్విటర్‌లో ఫేక్‌ అకౌంట్‌: ఆలీ

హైదరాబాద్‌: తన పేరుతో ట్విటర్‌లో ఫేక్‌ అకౌంట్‌ ఏర్పాటు చేశారని ప్రముఖ హాస్యనటుడు, వ్యాఖ్యాత ఆలీ అన్నారు.అకౌంట్‌ ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సైబరాబాద్‌ డీసీపీ రోహిణికి ఆయన ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు తనకు ఎలాంటి ట్విటర్‌ అకౌంట్‌ లేదని ఆయన వెల్లడించారు. ‘యాక్టర్‌ ఆలీ అఫీషియల్‌’ పేరుతో అకౌంట్‌ క్రియేట్‌ చేసి నటీనటుల్ని అభినందిస్తున్నట్లు  పోస్టులు పెడుతున్నారని చెప్పారు. ఆ అకౌంట్‌లో పెట్టిన వాటిని అధికారిక పోస్టులుగా భావించి మీడియా వార్తలు రాస్తోందని, ఇకపై తనపై ఏ సమాచారం తెలిసినా తన టీం మెంబర్స్‌తో చర్చించిన తర్వాతే వార్తలు రాయాలని కోరారు.

ప్రస్తుతం వైకాపాలో కీలక సభ్యుడిగా ఉన్నానని, తన వల్ల పార్టీకి, ముఖ్యమంత్రికి ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆలీ చెప్పారు. ‘‘ ఫేక్‌ అకౌంట్‌లో వాళ్లు రాసిన న్యూస్‌ కంటే.. అది నేనే పెట్టాననుకొని ఆ హీరోల ఫ్యాన్స్‌ చేసే  కామెంట్స్‌ చూస్తుంటే బాధకలుగుతోంది’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటివి పురనరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ రోహిణిని కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని