నిద్రలోనూ అవే కలవరింతలు - Alia Bhatt opens up about shooting in Telugu for RRR reveals she was speaking her lines in her sleep
close
Published : 25/12/2020 15:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిద్రలోనూ అవే కలవరింతలు

ఆలియాకు ఆర్‌ఆర్‌ఆర్‌ కష్టాలు

ముంబయి: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియా భట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆమె రామ్‌చరణ్‌ సరసన సీతగా మెప్పించనున్నారు. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌లో పాల్గొన్న ఆలియా.. తన అనుభవాల్ని పంచుకున్నారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటించడం నాకు విభిన్నమైన అనుభవాన్ని ఇచ్చింది. తెలుగు భాష తెలియదు. ఈ సినిమా కోసమే మొదటిసారి తెలుగు నేర్చుకున్నాను. ఏడాదిన్నర నుంచి ఈ సినిమా డైలాగ్స్‌తోనే కుస్తీపడుతున్నాను. నిద్రలోనూ అవే గుర్తుకువచ్చేవి. టీఫిన్‌, మధ్యాహ్న భోజనం‌, రాత్రి భోజనం.. ఇలా ప్రతి సమయంలోనూ వాటిని ప్రాక్టీసు చేస్తూ ఉండేదానిని. ఎంతో ప్రతిభావంతులైన రాజమౌళి‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’ అని ఆలియాభట్‌ తెలిపారు.

దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, హాలీవుడ్‌ నటుడు రేయ్‌ స్టీవ్‌సన్‌, ఎలిసన్‌ డ్యూడీ, ఒలీవియా మోరీస్‌ ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇవీ చదవండి

రామ్‌ ‘రెడ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

విజయశాంతి ఇచ్చిన సలహా అది!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని