నా పరిస్థితి శత్రువుకు కూడా వద్దు: చంటి - Alitho Saradaga Chanti and Himaja promo
close
Published : 05/11/2020 15:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా పరిస్థితి శత్రువుకు కూడా వద్దు: చంటి

హైదరాబాద్‌: ‘శత్రువుకు కూడా తనలాంటి పరిస్థితి ఎదురుకావొద్దు’ అని నటుడు చంటి భావోద్వేగానికి గురయ్యారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి నటి హిమజతో కలిసి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ‘అమ్మగారు చనిపోయిన విషయం పదిరోజుల వరకూ మీకు ఎవరూ చెప్పలేదట’ అంటూ ఆలీ ప్రశ్నించగా చంటి కన్నీటి పర్యంతమయ్యారు.

ఇక నటి హిమజ కూడా తనపై విమర్శలు చేస్తున్న వారిపై ఘాటుగా స్పందించారు. ‘మీ కెరీర్‌లో ఏదైనా ఇబ్బందులు పడ్డారా’ అని ప్రశ్నించగా, ‘కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంత డౌన్‌ పేమెంట్‌ కట్టి, ఈఎంఐ పద్ధతిలో కారు కొనుక్కుంటే నోటికొచ్చినట్లు మాట్లాడారు’ అంటూ ఆగ్రహానికి గురయ్యారు. అమ్మ గురించి చంటి ఏం చెప్పారు? హిమజ కోపానికి కారణం ఎవరు? తెలియాలంటే సోమవారం వరకూ వేచి చూడాల్సిందే! అప్పటివరకూ ఈ ఆసక్తికర ప్రోమోను చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని