నేను మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కాదు: నవ్‌దీప్‌ - Alitho saradaga Navdeep promo
close
Published : 29/10/2020 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కాదు: నవ్‌దీప్‌

వాళ్లిద్దరి కోసం చొక్కాలు చింపుకున్నా

హైదరాబాద్‌: ‘జై’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై ‘గౌతమ్‌ ఎస్‌ఎస్‌సి’, ‘చందమామ’ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు నవ్‌దీప్‌. కథానాయకుడిగానే కాకుండా నటుడిగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ సెలబ్రిటీ చాట్‌ కార్యక్రమానికి తాజాగా నవ్‌దీప్‌ విచ్చేశారు.

ఓ రోజు సినిమా చూసి వస్తుంటే రిక్షా అతను తనని చూసి.. ‘హీరో అవ్వొచ్చుగా బాబు. భలే ఉన్నారు మీరు’ అని అన్నాడని.. ఆ మాటతో ఇండస్ట్రీలోకి రావాలనే ఆశ కలిగిందని నవ్‌దీప్‌ తెలిపారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ల కోసం తాను థియేటర్లలో చొక్కాలు చింపుకొనే వాడినని చెప్పారు. అనంతరం తాను మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కాదని సరదాగా చెప్పారు. తన జీవితానికి సంబంధించి నవ్‌దీప్‌ చెప్పిన ఎన్నో సరదా విషయాలు తెలుసుకోవాలంటే వచ్చే సోమవారం ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ చూడండి. నవంబర్‌ 2న ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ ఎపిసోడ్‌ ప్రోమో మీ కోసం.. Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని