‘నెమలికి నేర్పిన నడకలివే’: ‘సప్తపది’ సబిత-గిరీశ్‌ - Alitho saradaga latest promo
close
Published : 23/11/2020 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నెమలికి నేర్పిన నడకలివే’: ‘సప్తపది’ సబిత-గిరీశ్‌

హైదరాబాద్‌: ‘సప్తపది’ చిత్రంలో నటించి ‘నెమలికి నేర్పిన నడకలివే’ పాటతో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అలనాటి నటీనటులు ‘సబిత-గిరీశ్‌’. దాదాపు నలభై ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో సబిత-గిరీశ్‌ పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోనున్నారు.

‘నెమలికి నేర్పిన నడకలివే’ పాట దాదాపు నలభై ఏళ్ల అనంతరం మళ్లీ ఇప్పుడు మమ్మల్ని ఇక్కడకు తీసుకురావడం అనేది గురువు కె.విశ్వనాథ్‌కు చెందుతుంది. ‘సప్తపది’ చిత్రం ద్వారా పరిచయమయ్యానుఅని ఆమె వివరించనున్నారు. దర్శకుడు విశ్వనాథ్‌ ఏం చూసి కథానాయికగా మిమ్మల్ని ఎంపిక చేశారు అని ఆలీ అడుగగా.. అదే ‘అర్థం కాలేదు’ అంటూ సరదాగా నవ్వులు పూయించనున్నారు. అంతే కాకుండా మీకెలా వచ్చింది అవకాశం? అని గిరీశ్‌ను ప్రశించగా.. ‘ఒక నిబంధన పెట్టారు.. ఫ్లూట్‌ నేర్చుకోవాలన్నారు’అని ఆయన చెప్పనున్నారు. వీరిద్దరూ చెప్పిన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే సోమవారం (నవంబర్‌ 23)న ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ ప్రోమో చూసేయండి..!

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని