ఫిబ్రవరి వరకూ జాగ్రత్త తప్పదు - All 18 yrs Above People Vaccinated By January Says AP CM Jagan
close
Updated : 30/04/2021 10:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిబ్రవరి వరకూ జాగ్రత్త తప్పదు

45 ఏళ్లు దాటినవారి వ్యాక్సినేషన్‌కే 5 నెలలు
అందరికీ టీకాలందేసరికి జనవరి నెలాఖరు
కరోనాపై సమీక్షలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ‘దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలంటే వచ్చే ఏడాది జనవరి చివరికి సాధ్యమవుతుంది. కరోనాకు టీకాలు వేయడమే పరిష్కారంగా ఉంది. వచ్చే ఫిబ్రవరి వరకూ అందరం జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా టీకాలపై గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా టీకాల సరఫరా, అవసరంపై కీలకమైన గణాంకాలు ప్రస్తావించారు. ఆయన ఏం చెప్పారంటే... ‘దేశంలో 45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే ఇంకా నాలుగైదు నెలలు పడుతుంది. అలాంటివారు 26 కోట్ల మంది ఉన్నారు. వారికి రెండు డోసుల టీకాలు వేయాలంటే 52 కోట్ల డోసులు అవసరం. వీటిలో ఇప్పటికి 15 కోట్ల డోసులే ఇచ్చాం. ఇంకా 37 కోట్ల టీకా డోసులు వారికే కావాలి. భారత్‌ బయోటెక్‌ నెలకు కోటి డోసులు, సీరం ఇన్‌స్టిట్యూÆట్‌ 6 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటితోపాటు రెడ్డి ల్యాబ్స్‌, ఇతర సంస్థ ఉత్పత్తులు రావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుంది. అన్నీ కలిపి 45 ఏళ్లు దాటినవారికి ఇంకా కావాల్సిన 37 కోట్ల వ్యాక్సిన్‌ డోసులకు ఆగస్టు, సెప్టెంబరు నెలవరకు సమయం పడుతుంది’ అని ముఖ్యమంత్రి వివరించారు.

18 ఏళ్లు దాటినవారికి మరో నాలుగు నెలలు
‘18 ఏళ్లు దాటినవారు దేశంలో 60 కోట్ల మంది ఉన్నారు. వారికి 120 కోట్ల డోసులు కావాలి. సెప్టెంబరు తర్వాతే వారికి వ్యాక్సినేషన్‌ సాధ్యం. అప్పటి నుంచి జనవరి చివరి వరకు వారి వ్యాక్సినేషన్‌కే సమయం సరిపోతుంది. ఈ లెక్కన దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొత్తం పూర్తికావాలంటే జనవరి నెలాఖరు అవుతుంది. అందుకే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకూ మనమంతా జాగ్రత్తగా ఉండాలి. పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి’ అని జగన్‌ అన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని