‘‘టీకాను ఉచితంగా పొందటం దేశ ప్రజల హక్కు’’ - All Indians Have Right To Free Covid Vaccine
close
Updated : 25/10/2020 13:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘టీకాను ఉచితంగా పొందటం దేశ ప్రజల హక్కు’’


దిల్లీ : కరోనా వైరస్‌కు సంబంధించిన టీకా అందుబాటులోకి వచ్చాక, దానిని భారతీయులందరికీ ఉచితంగా సరఫరా చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ డిమాండ్‌ చేశారు. బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో భాజపా తమ మేనిఫెస్టోలో ఉచిత టీకాల గురించి ప్రస్తావించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.  దేశం మొత్తానికి టీకా‌ను ఉచితంగా పొందే హక్కుందని కేజ్రవాల్‌ వివరించారు. టీకాను ఉచితంగా అందించాలన్న విషయం గురించి ఆయన మాట్లాడటం ఇది రెండోసారి. ‘‘మీకు ఓట్లు వేయని ప్రజలకు కరోనా టీకాలు ఉచితంగా లభించవా?’’ అని ఆప్‌ భాజపాను ప్రశ్నించింది. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌ మాట్లాడుతూ..బిహార్‌ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు సరఫరా చేయటమే తమ మేనిఫెస్టోలోని మొదటి అంశమని పేర్కొనటం వివాదానికి కారణమయ్యింది. 

బడులు ఇప్పుడే తెరవడంలేదు..
కరోనాతో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల్లో పాఠశాలల్ని ఇప్పుడే తెరవడంలేదని ఆప్‌ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే దిల్లీ ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయం ప్రకారం ఈ నెల 31వరకు పాఠశాలలు మూసే ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే బడి గంట మోగేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం కనబడుతోంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు మార్చి 16 నుంచి మూసివేసిన విషయం తెలిసిందే. తదనంతరం మార్చి 25 నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించాక దశల వారీగా ఆంక్షలు సడలించినప్పటికీ విద్యా సంస్థలకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. ఇటీవల జారీచేసిన మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం పాఠశాలలు తెరుచుకొనే నిర్ణయం రాష్ట్రాలకే అప్పగించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని