
తాజా వార్తలు
విజయ్ మరింత ఎత్తుకు ఎదగాలి: బన్నీ
రౌడీ కోసం స్టైలిష్‌స్టార్ ట్వీట్
హైదరాబాద్: స్టైల్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ విజయ్ దేవరకొండ. ఫ్యాషన్ పట్ల తనకున్న అభిరుచిని ఎంతోమందికి పరిచయం చేసేవిధంగా ఆయన.. ‘రౌడీ’ పేరుతో దుస్తుల బ్రాండ్‌ని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ స్టైల్, రౌడీ బ్రాండ్‌కు ఫ్యాషన్ ప్రియులు మాత్రమే కాకుండా బన్నీ సైతం ఫిదా అయ్యారు. విజయ్ స్టైల్ తనకి బాగా నచ్చిందని.. ‘రౌడీ’ బ్రాండ్ దుస్తులు అడిగానని అల్లుఅర్జున్ ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో విజయ్ ఆయన కోసం ప్రత్యేకంగా కొన్ని దుస్తులు డిజైన్ చేసి పంపించారు కూడా.
కాగా, తాజాగా విజయ్ దేవరకొండ మరోసారి ‘పుష్ప’ హీరో కోసం దుస్తులు డిజైన్ చేసి పంపించారు. అయితే, విజయ్ పంపిన దుస్తులు తనకి నచ్చాయని బన్నీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా..‘ఇలాంటి అందమైన, సౌకర్యవంతమైన దుస్తులు పంపించిన నా బ్రదర్ విజయ్ దేవరకొండ, రౌడీ క్లబ్ టీమ్‌కు ధన్యవాదాలు. నాపై నువ్వు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు బ్రదర్. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని అడవుల్లో ఈ సినిమా షూటింగ్ గత కొన్నిరోజులుగా జరుగుతోంది. అయితే, తాజాగా యూనిట్లో ఓ సభ్యుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతానికి పేకప్ చెప్పినట్లు సమాచారం. మరోవైపు, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రానున్న ‘ఫైటర్’లో విజయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్యపాండే సందడి చేయనున్నారు.