close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 28/05/2020 02:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నా సినిమా బాహుబలి కంటే ఎక్కువ రాబట్టింది!

‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’కి 43 ఏళ్లు.. అమితాబ్‌ ట్వీట్‌

ముంబయి: బాలీవుడ్‌ కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ నటించిన సినిమా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ విడుదలై 43 ఏళ్లు పూర్తయింది. అప్పట్లో ఈ సినిమాకు ఎంతటి ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1977లో విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.7.25 కోట్లు రాబట్టిందని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఈ సినిమా 2017లో వచ్చిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ వసూళ్ల కంటే ఎక్కువ రాబట్టిందని అమితాబ్‌ బుధవారం ట్వీట్‌ చేశారు. ‘43 ఏళ్లు... ఆ రోజుల్లోనే ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ రూ.7.25 కోట్లు రాబట్టినట్లు అంచనా వేశారు. ఆ మొత్తాన్ని అన్ని విధాలుగా లెక్కిస్తే ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ వసూళ్లను అధిగమిస్తుంది’ అని పేర్కొన్నారు. అంతేకాదు ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ ముంబయిలో 25 వారాలపాటు 25 థియేటర్లలో ఆడిందని బిగ్‌బి అన్నారు. ఇప్పుడు అలా జరగడం లేదని, ఆరోజులు మళ్లీ రావని పేర్కొన్నారు.

‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ 2017లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా కేవలం భారత్‌లో రూ.510 కోట్లు రాబట్టింది. 1977లో 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' ఒక్కో టికెట్‌ ధర రూ.2. ఆ సమయంలో ఈ సినిమా రూ.7.25 కోట్లు వసూలు చేసిందంటే.. దాదాపు 3,62,50,000 మంది చూసినట్లు అర్థం. ఈ సంఖ్యను 2017లో టికెట్‌ ధర రూ.150తో గుణిస్తే.. రూ.543 కోట్లు వస్తుంది. అంటే ఇది ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ మొత్తం వసూళ్ల (స్వదేశంలో) కంటే ఎక్కువే అంటున్నారు విశ్లేషకులు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.