close
Array ( ) 1

తాజా వార్తలు

‘గల్లీబాయ్‌’కి బ్లాక్‌లేడీ వశం

ఫిలింఫేర్‌లో అవార్డుల వర్షం

గువహటి: చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది అస్సోంలో అట్టహాసంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకలో ‘గల్లీబాయ్‌’ చిత్రం అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకుంది. ఎంతో వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలో బాలీవుడ్‌ తారలు సందడి చేశారు. రణవీర్‌ సింగ్‌, కార్తీక్‌ ఆర్యన్‌, మాధురీ దీక్షిత్‌ తమ డ్యాన్సులతో అతిథులను అలరించారు.

విజేతలు వీరే..

1.ఉత్తమ చిత్రం: గల్లీబాయ్‌

2.ఉత్తమ దర్శకురాలు: జోయా అక్తర్‌ (గల్లీబాయ్‌)

3.ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): ఆర్టికల్‌ 15, సన్‌చూరియా

4.ఉత్తమ నటుడు: రణ్‌వీర్‌ సింగ్‌ (గల్లీబాయ్‌)

5.ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): ఆయుష్మాన్‌ ఖురానా (ఆర్టికల్‌ 15)

6.ఉత్తమ నటి: ఆలియాభట్‌ (గల్లీబాయ్‌)

7.ఉత్తమ నటి (క్రిటిక్స్‌): భూమి ఫడ్నేకర్‌, తాప్సీ (శాండ్‌ ఖీ అంఖ్‌)

8.ఉత్తమ సహాయ నటుడు: సిద్ధాంత్‌ చతుర్వేది (గల్లీబాయ్‌)

9.ఉత్తమ సహాయ నటి: అమృతా సుభాష్‌ (గల్లీబాయ్‌)

10.ఉత్తమ సంగీతం: జోయా అక్తర్‌-అంకుర్‌ తివారి (గల్లీబాయ్‌), మిథున్‌, అమాల్‌ మల్లిక్‌, విశాల్‌ మిశ్రా, సచత్‌ పరంపర, అఖిల్‌ సచ్‌దేవా (కబీర్‌ సింగ్‌)

11.ఉత్తమ గేయరచయిత: డివైన్‌, అంకుర్‌ తివారీ (అప్నా టైమ్‌ ఆగయా-గల్లీబాయ్‌)

12.ఉత్తమ గాయకుడు: అర్జిత్‌ సింగ్‌ (కళంక్‌ నహి-కళంక్‌)

13.ఉత్తమ గాయని: శిల్పారావు (గంగ్రూ-వార్‌)

14.ఉత్తమ నూతన దర్శకుడు: ఆదిత్య ధార్‌ (ఉరి)

15.ఉత్తమ నూతన నటుడు: అభిమన్యు దసాని (మర్ద్‌ కో దర్డ్‌ నహి హోతా)

16.ఉత్తమ నూతన నటి: అనన్య పాండే (స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2,  పతీ పత్నీ ఔర్‌ హో)

17. బెస్ట్‌ ఒరిజినల్‌ స్టోరీ: అనుభవ్‌ సిన్హా, గౌరవ్‌ సోలంకి (ఆర్టికల్‌ 15)

18.ఉత్తమ స్ర్కీన్‌ప్లే: రీమా, జోయా అక్తర్‌ (గల్లీబాయ్‌)

19.ఉత్తమ మాటల రచయిత: విజయ్‌ మౌర్య(గల్లీబాయ్‌)

20.జీవిత సాఫల్య పురస్కారం: రమేశ్‌ సిప్పీ

21.ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ సినిమా : గోవిందా

22.ఆర్డీ బర్మన్‌ అవార్డు ఫర్‌ అప్‌కమింగ్‌ మ్యూజిక్‌ టాలెంట్‌ : సశ్‌వత్‌ సచ్‌దేవ్‌(ఉరి)


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.