దిల్లీలో కరోనాపైఅమిత్‌ షా అత్యవసర సమావేశం! - Amit shah calls for urgent meeting in the wake of rising cases in delhi
close
Published : 15/11/2020 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో కరోనాపైఅమిత్‌ షా అత్యవసర సమావేశం!

దిల్లీ: దిల్లీలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అత్యవసరంగా సమీక్షా సమావేశానికి పిలుపునిచ్చారు. నేడు సాయంత్రం ఐదు గంటలకు భేటీ జరిగే అవకాశం ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌తో పాటు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై అమిత్‌ షా కలగజేసుకోవడం ఇది రెండోసారి. జూన్‌-జులై నెలల్లోనూ దిల్లీలో కరోనా కేసులు భారీగా నమోదైన విషయం తెలిసిందే. అప్పట్లోనూ సీఎంతో హోంమంత్రి భేటీ అయ్యారు. 

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో కరోనా విజృంభణకు గల కారణాలు, కట్టడికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. శనివారం దిల్లీలో 7,340 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,82,170కి చేరాయి. వీరిలో 44,456 మంది ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా మరో 96 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 7,519కి పెరిగింది. అక్టోబరు 13 నుంచి నవంబరు 13 మధ్య క్రియాశీల కేసుల సంఖ్య 21,490 నుంచి 43 వేలకు పెరగడంతో రాజధాని నగరంలో ఆస్పత్రులకు ఒక్కసారిగా తాకిడి పెరిగింది.

ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌ మరో వారం నుంచి పది రోజుల్లో మహమ్మారి వ్యాప్తిని అదుపులోకి తెస్తామన్నారు. అందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే నిపుణులు మాత్రం మహమ్మారి నియంత్రణలోకి రావాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందేనని అంటున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని