అమితాబ్‌-అజయ్‌ ‘మే డే’ షురూ - Amitabh Bachchan Ajay Devgn Start Mayday Start Shooting
close
Published : 11/12/2020 22:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమితాబ్‌-అజయ్‌ ‘మే డే’ షురూ

హైదరాబాద్‌: బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘మే డే’. ఈ సినిమాకు దర్శక, నిర్మాతగా కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ పనిచేస్తుండటం విశేషం. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన, బిగ్‌బి కలిసి పనిచేస్తున్న సినిమా ఇది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అంగీరా ధార్‌ కథానాయికలు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో అజయ్‌ నటిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో శుక్రవారం ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. రెగ్యులర్‌ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. తొలి సన్నివేశానికి అజయ్‌ దేవగణ్‌ స్నేహితుడు, తెలుగు జోతిష్యుడు బాలు మున్నంగి క్లాప్‌ కొట్టారు. బాలీవుడ్‌ హిట్‌ ‘తానాజీ’కి కూడా ఆయనే క్లాప్‌ కొట్టారట.

2022 ఏప్రిల్‌ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఈ సందర్భంగా అజయ్‌ దేవగణ్‌ ప్రకటించింది. ‘‘శుక్రవారం ‘మే డే’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. సినిమా పూర్తయ్యేవరకూ ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతాం. భగవంతుడితోపాటు నా తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా కోరుకుంటున్నా’’ అని అన్నారు.

ఇవీ చదవండి..
భారీ యాక్షన్‌ చిత్రంలో హృతిక్‌
బ్రహ్మాస్త్ర ఆ బడ్జెట్‌ను దాటేసిందా?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని